ఆ ప్రధానోపాధ్యాయుడు రూటే వేరు

by Disha Web Desk 22 |
ఆ ప్రధానోపాధ్యాయుడు రూటే వేరు
X

దిశ, నాగారం: విధులకు గైర్హాజరువుతూనే ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి నెల జీతం తీసుకుంటున్న సంఘటన నాగారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని మామిడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తూ పై అధికారుల ఆదేశాలు లేకుండానే తనకు బదులు ప్రైవేట్ వ్యక్తిని పెట్టి బయట కాలక్షేపం చేస్తూ తన సొంత పనులు చేసుకుంటూ సమయం కుదిరినప్పుడు వారానికి ఒక్కసారి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు ఒకేసారి పెట్టి జీతం తీసుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రధానోపాధ్యాయుడు విధులకు గైరాజరవుతుండడంతో విద్యార్థులకు పాఠాలు వెనుకబడిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో గత కొన్ని నెలల నుండి ఇదే తంతు కొనసాగుతుండడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక పిల్లల్ని వివిధ ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నామని తెలిపారు. దీనికి తోడు మండల విద్యాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిది ఆడింది ఆట పాడింది పాటగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శాశ్వతకాల మండల విద్యాదికారిని నియమించండి

జాజిరెడ్డి గూడెం మండల విద్యాదికారిగా పనిచేస్తున్న మండల విద్యాధికారి నాగారం మండలానికి ఇంచార్జ్‌గా సుమారు ఎనిమిది సంవ్సరాలుగా శాశ్వత విద్యాధికారి లేక ఇంచార్జ్‌గా ఉండడం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో అర్థం కావడం లేదని పర్యావేక్షణ లేదని మండల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు సరిగా హాజరుకాని ప్రధానోపాధ్యాయుడు పై చర్యలు తీసుకొని మండలానికి శాశ్వత కాలం విద్యాధికారి నీ నియమించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed