పట్టుదలతో పనిచేసే ఎమ్మేల్యే భూపాల్ రెడ్డి.. మంత్రి తలసాని

by Sumithra |
పట్టుదలతో పనిచేసే ఎమ్మేల్యే భూపాల్ రెడ్డి.. మంత్రి తలసాని
X

దిశ, నల్లగొండ బ్యూరో : పట్టుదలతో పనిచేసే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్.జి.కళాశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించనున్న పిష్ పెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది క్రితం పట్టణానికి వచ్చే సందర్భంగా కనిపించిన వాతావరణం ఇప్పటి వాతావరణంలో చాలా మార్పు ఉందని ఆయన అన్నారు. 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న నాయకులు చేయలేని అభివృద్ధి కేవలం నాలుగేళ్లలో ఎమ్మెల్యే చేసి చూపించాడని అన్నారు. ఇవే కాకుండా ఇంకా వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూనరిల్లిపోతున్న కులవృత్తులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన నిధులు నిధులు కేటాయిస్తూ వారందరినీ అక్కున చేర్చుకుంటున్నాడని అన్నారు. అందులో భాగంగానే ఉచిత చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, పాడి గేదలు తదితర సంక్షేమ పథకాలు కుల వృత్తుల కోసం అమలు చేస్తున్నవేనన్నారు.

నిత్యం పేద ప్రజల సంక్షేమ కోసం ఆలోచన చేసి కేసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు ఈ నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చిన సమూల మార్పులను ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. చాలామంది అంతజేశాం, ఇంత చేశామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఎక్కడ నయాపైస అభివృద్ధి చేయలేదన్నారు. కులవృత్తుల రక్షణకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రతిఒక్కరు అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నాగార్జునసాగర్ శాసన సభ్యులు నోముల భగత్, గోట్ అండ్ షీప్ పెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల రాజు యాదవ్, జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి, ఎస్.పి.అపూర్వ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్ ఎం. సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు వివిధ మత్స్య కార్మిక సహకార సంఘాల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed