- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్లపైనే విచ్చలవిడిగా పార్కింగ్.. వాహనాదారులకు తప్పని తిప్పలు

దిశ,భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించిన అందులో సగం స్థలం వాహనాలు నిలవడానికీ సరిపోతుంది. గతంలో లాగానే రహదారి ఇరుకుగా మారి ప్రయాణికుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా కర్నాటి కాంప్లెక్స్, వైన్స్, టీ పాయింట్ ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడం, ఎటు పడితే అటు రాంగ్ రూట్ లో వెళ్లడం వల్ల సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు.ప్రధాన రహదారులతో పాటు గల్లీలోనూ వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల పెద్ద సమస్యగా మారింది.
దారి ఆక్రమణకు గురైంది..
పట్టణంలోని కర్నాటి కాంప్లెక్స్,వైన్స్,టీ పాయింట్ల ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాహనాలు రోడ్డు పైనే నిలపడంతో దారి అక్రమనకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పోలీసులు స్పందించి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అడ్డగోలు పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్నాం : చేరాల సుధీర్, పోచంపల్లి పట్టణవాసి
ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లిని సందర్శించేందుకు దేశ విదేశీయులు సైతం నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఇంతటి ప్రాచీనమైన పోచంపల్లిలో పార్కింగ్ స్థలం లేకపోవడం బాధాకరం .పట్టణంలోని ప్రధానంగా నేతాజీ చౌరస్తా నుండి కరెంట్ ఆఫీస్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ఈ దారి వెంట ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
వాహనాలు నిలిపితే చర్యలు : ఎస్ఐ భాస్కర్ రెడ్డి, భూదాన్ పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి పట్టణంలో రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమే. ప్రధానంగా సాయంత్రం వేళలో టీ పాయింట్, వైన్స్ ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపితే చలాన్లు విధించి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చిన, లైసెన్సులు లేకుండా రోడ్లపై వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.