బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు...

by Kalyani |
బెల్ట్ షాపులపై  ఆకస్మిక తనిఖీలు...
X

దిశ, భువనగిరి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులపై రూరల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి ఆదివారం కేసులు నమోదు చేశారు. బెల్ట్ షాపులపై తనిఖీలు, కేసులకు సంబంధించి ఎస్సై వి. సంతోష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మండలంలోని వడాయి గూడెం, అనంతారం, బి.ఎన్ తిమ్మాపూర్ లలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 132బీరు బాటిల్స్, 20 క్వాటర్ బాటిల్స్ , టోటల్ గా 131లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. పలు బెల్ట్ షాపుల యజమానులు ముగ్గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. ఎవరైనా కోడ్ ఉల్లంఘన చేసి బెల్టుషాపులు నిర్వహిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.



Next Story