మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి..

by Disha Web Desk 11 |
మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి..
X

దిశ, భువనగిరి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని TRVMRU రాష్ట్ర అధ్యక్షుడు దోమకొండ సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ శాఖలో పీసు రేటు పద్దతిన గత 20 సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ కార్మికులు పనిచేస్తున్నారు కానీ, నేటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులు విద్యుత్ సంస్థకు వెట్టిచాకిరి చేసినా నెలకు సుమారు రూ. 5 వేల జీతానికి మించి రావడం లేదని, ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగకపోవడంవల్ల వచ్చే నెల నుంచి చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణకు సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా ముందుండాలని అందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి అమృతం శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పక్కి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed