- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Collectorate : కలెక్టరేట్ లో నాసిరకం పనులు…ఊడిపడిన పీవోపీ సీలింగ్
Collectorate : కలెక్టరేట్ లో నాసిరకం పనులు…ఊడిపడిన పీవోపీ సీలింగ్
by Kalyani |

X
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం రెండవ అంతస్తులో పీవోపీ సీలింగ్ ఊడి పడడం జరిగిందని సమాచారం. ఈ సంఘటనలో జరిగినప్పుడు ఎవరూ ఆ ప్రాంతంలో లేరని తెలుస్తోంది. కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి కాంట్రాక్టు నాసిరకం పనులు చేపడుతున్నాడని తెలిసినప్పటికీ… గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పాటు సంబంధిత అధికారులు కూడా ముడుపులకు ఆశపడి నాసిరకం పనులు చేసిన పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం పనులు చేయడంతోటే పిఓపి ఊడిపడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన పైన కలెక్టర్ దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.
Next Story