నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్

by Disha Web Desk 22 |
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్
X

దిశ, తిరుమలగిరి (సాగర్): మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీదా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మండలం నుంచి బీఆర్ఎస్ ఎంపీటీసీతల ఫోరం మండల అధ్యక్షులు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి, మండల కేంద్రం సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, పలువురు సర్పంచ్ లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలసి ప్రచారం కొనసాగిస్తునప్పటికి ఆ పార్టీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీ పద్ధతులు నచ్చకపోవడంతో వైస్ ఎంపీపీ దిలీప్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం రాత్రి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో ఆయన సమావేశం అయ్యారు. ఆయన తన అనుచరులతో కలిసి పార్టీలో చేరిక గురించి మాట్లాడారు. ఇప్పటికే ఆయన వెంట ఉన్న సర్పంచులకు, ముఖ్య కార్యకర్తలకు, అనుచరులకు సమాచారం అందించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, జై వీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం ఆయన పుచ్చుకోనున్నారు. మండలంలో ప్రజా ప్రతినిధిగా, వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటంతో పార్టీలో చేర్చుకొని ఆయన సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోనున్నది. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఎన్నిక, ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నోముల భగత్ గెలుపులో మండలంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు, ప్రజల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి ఎదుగుదలకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అనుచరుడైన ఆయన పార్టీ వీడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed