ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తించాలి: శంకర్ నాయక్

by Dishanational1 |
ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తించాలి: శంకర్ నాయక్
X

దిశ, మాడుగులపల్లి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం మోపిన తప్పుడు కేసుతో ఈరోజును ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయంగా పేర్కొనాలని అన్నారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తుందని అన్నారు. కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ కూడా 24 గంటలు గడవక ముందే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం కుంటుపడి నిరంకుశ పాలన పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో సామాన్య ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు నిరసిస్తూ ప్రభుత్వ విధి విధానాలపై అందిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు, బంటు మాధవరెడ్డి, ఇరుకుల వెంకన్న, సింగం ముత్తయ్య, మోహన్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed