- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మెప్మాలో షాడో మేడమ్.. అంతా ఆమె కనుసైగల్లోనే..

సూర్యాపేట మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారుతోంది. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో అవినీతి రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయంలో ఉద్యోగం చేసే ఓ షాడో మేడమ్ ఈ సంస్థలో చక్రం తిప్పుతూ రూ.లక్షలు దండుకుంటుందని ఆరోపణలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పొదుపు సంఘం మీటింగ్ పెట్టాలని హుకూం జారీ చేసి ఆయా సంఘాల్లోని మహిళలను ఒక దగ్గర చేర్చి ఆ మీటింగ్లో ఎంసీజే (మహా సక్సెస్ జర్నీ) అనే ఫేక్ చైన్ సిస్టం జాబ్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయక మహిళలను నమ్మబలికించి అందులో జాయిన్ అయ్యేలా ప్రేరేపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షాడో మేడమ్ మీటింగ్కు ముందే దారి ఖర్చులు ఇవ్వాలని, అలాగే మీటింగుకు హాజరయ్యే మధ్యలో భోజన ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలని, వారి నుంచి మీటింగ్ పేరుతో రూ.7వేలు వసూళ్లు చేస్తుందని విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని నాలుగు డివిజన్లలో స్త్రీనిధి, పొదుపు సంఘాల మీటింగ్లు పెట్టాలని సంబంధిత ఆర్పీలను ఆదేశించి మీటింగుకు రూ.7వేల చొప్పున వసూలు చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఐకేపీల ద్వారా జరిగిన ధాన్యం సేకరణ అక్రమాలలో కూడా ఈ షాడో మేడమ్ పాత్ర దండిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షాడో మేడమ్కు రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కొంతమంది పొదుపు సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారుతోంది. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో అవినీతి రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయంలో ఉద్యోగం చేసే ఓ షాడో మేడమ్ ఈ సంస్థలో చక్రం తిప్పుతూ రూ.లక్షలు దండుకుంటుందని భారీ ఆరోపణలు జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి. పొదుపు సంఘం మీటింగ్ పెట్టాలని హుకూం జారీ చేసి పొదుపు సంఘంలో ఉన్న మహిళలను ఒక దగ్గర చేర్చి ఆ మీటింగ్లో ఎంసీజే (మహా సక్సెస్ జర్నీ) అనే ఫేక్ చైన్ సిస్టం జాబ్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.5వేలు కట్టి జాయిన్ అవ్వాలని, జాయిన్ అయిన వెంటనే మీకు మొదట దఫాగా రూ.1600 వస్తాయని, అలాగే 2వ దఫాగా రూ.1300 వస్తాయని పొదుపు సంఘాలలో ఉండే అమాయక మహిళలను నమ్మబలికించి అందులో జాయిన్ అయ్యేలా ప్రేరేపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షాడో మేడమ్ మీటింగ్కు ముందే దారి ఖర్చులు ఇవ్వాలని, అలాగే మీటింగుకు హాజరయ్యే మధ్యలో భోజన ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలని, వారి నుంచి మీటింగ్ పేరుతో రూ.7వేలు వసూళ్లు చేస్తుందని విమర్శలు గుప్పుమంటున్నాయి.
అంతా ఆమె కనుసైగల్లోనే..
జిల్లాలోని నాలుగు డివిజన్లలో స్త్రీనిధి, పొదుపు సంఘాల మీటింగ్లు పెట్టాలని సంబంధిత ఆర్పీలను ఆదేశించి మీటింగుకు రూ.7వేల చొప్పున వసూలు చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఐకేపీల ద్వారా జరిగిన ధాన్యం సేకరణ అక్రమాలలో కూడా ఈ షాడో మేడమ్ పాత్ర దండిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెప్మా కార్యక్రమాలు, పొదుపులు, స్త్రీ నిధి రుణాలు, మహిళా శక్తి రుణాలు పక్కదారి పట్టించడంలో ఈ షాడో మేడమ్ దిట్ట అని ఆ శాఖలోని తోటి ఉద్యోగులు ఆరోపించడం గమనార్హం. కుట్టు మిషన్ యూనిఫాం సంబంధించిన ఇతర పనులను అర్హులకు ఇవ్వకుండా ఎవరు దండిగా డబ్బులు ఇస్తే వారికే కట్టపెడుతుందని ఆ శాఖలోని పలువురు ఉద్యోగులు గుర్రుమంటున్నారు.
రాజకీయ అండదండల పేరుతో బెదిరింపులు..
జిల్లాలోని మెప్మా కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న షాడో మేడమ్కు రాజకీయ అండదండలు ఉన్నాయని, తాను రాజకీయ నాయకులకు దగ్గర అని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు చెప్తేనే తనకు ఈ ఉద్యోగం వచ్చిందని ఆ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులను నమ్మించి షాడో మేడం అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని సంబంధిత పొదుపు సంఘాల మహిళలను హెచ్చరిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలోనే తరచుగా డబ్బులు ఇవ్వాలని హుకూం జారీ చేసి వేధిస్తుందని కొంతమంది పొదుపు సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా దృష్టికి రాలేదు..
మెప్మా పేదరిక నిర్మూలన సంస్థలో మీటింగుల పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. అలాగే మీటింగ్లు పెట్టి చైన్ సిస్టం బిజినెస్లో చేరాలని పొదుపు సంఘాలలోని మహిళలను ఇబ్బంది పెడుతున్నట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని పొదుపు సంఘం మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే మాకు వెంటనే ఫిర్యాదు చేయాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్ బి.శ్రీనివాస్ అన్నారు.