కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత మృతి

by Disha Web |
కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత మృతి
X

దిశ, నూతనకల్ : నూతనకల్ మండలం సోమ్లాతండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గుగులోతూ (60) గుండెపోటుతో మరణించాడు. గురువారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గుగులోతు కిస్తూ గుండెపోటుతో అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నియోజకవర్గ ఇన్ చార్జి గుడిపాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు గుగులోతు కృష్ణ, కళ్లెం కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తండు సత్యనారాయణ, దారిపల్లి వీరన్న, మండల కాంగ్రెస్ నాయకులు శంకర్, సామ ఉపేందర్ రెడ్డి, పసుల అశోక్ యాదవ్,మోహన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్ప నాయక్ ,రవీందర్, వెంకన్న, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed