- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బడి ఈడు పిల్లలు బడిలో పనికి రావాలి..
by Sumithra |

X
దిశ, నల్లగొండ : బడి ఈడు పిల్లలు బడికి రావాలి.. అది ప్రభుత్వ బడికి రావాలని బడిబాట కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వ బడిలో ఉచిత పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్ లు ఇస్తున్నాం, నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్తున్నాం, అని గొప్పలు వరకే పరిమితం ఐనట్లు తెలుస్తుంది. నల్లగొండ జిల్లా మండలంలోని నర్సింగ్ బట్ల ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో బడికి వచ్చిన పిల్లలతో బడిలో పనులు చేపించుకుంటున్నారు.
టీచర్లకు నీళ్లు తేవడానికి చిన్న పిల్లలతో నీటి క్యాను మోపిస్తూ వారికి చదువులు చెప్పాల్సింది పోయి వారితో పనులు చేపిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యి పట్టుమని పది రోజులు కాకముందే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అని ఆ పాఠశాల సిబ్బంది పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి అని అక్కడి గ్రామ యువత కోరుకుంటున్నారు.
Next Story