గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం పెంచాలి : ఎమ్మెల్యే కుంభం

by Disha Web Desk 22 |
గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం పెంచాలి : ఎమ్మెల్యే కుంభం
X

దిశ, భూదాన్ పోచంపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు 24 గంటలు వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామీణ పర్యాటక స్థానాన్ని సంపాదించిన పోచంపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పెద్ద చెరువు సుందరీకరణకు హెచ్ఎండీఏ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. చెరువు ఆధునికీకరణ పనుల పై పలు సూచనలు చేశారు.


Next Story