రేపటి నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

by Disha Web Desk 22 |
రేపటి నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం
X

దిశ, సంగారెడ్డి: రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. సంతకం చేయడంతో పాటుగా ఆర్టీసీ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉచిత ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. 9వ తేదీ సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిచనున్నారు. జిల్లాలో మధ్యాహ్నం 2.00 గంటల తరువాత ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు.

ఆడపిల్లలు మొదలుకుని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు వయస్సుతో సంబంధం లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆరు డిపోలు, రెండు మిని డిపోలు, ఉమ్మడి జిల్లాలోని ఆరు, రెండు మిని డిపోలు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక డిపోల పరిధిలో 599 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అందులో పల్లెవెలుగు 207, మిని పల్లెవెలుగు 13, ఎక్స్‌ప్రెస్ బస్సులు 101 ఉన్నాయి. వీటిలో ప్రతి రోజు 35 శాతం మహిళలు ప్రయాణం చేస్తున్నారు.

మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్నపిల్లలకు ఇది వరకు టికెట్ తీసుకుని ప్రయాణించేవారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడి నేటి నుంచి మహిళలందరికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడివరకైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వయస్సుతో సంబందం లేకుండా మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వలు విడుదల చేశారు. బస్సులు ఇప్పటి వరకు 35శాతం ప్రయాణించే మహిళల శాతం ఇక ఉచిత ప్రయాణం అనగానే ఆర్టీసీకి మహిళల తాకిడి ఎక్కవగా ఉండనున్నది. 321 పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.

మహిళలు ఆధార్ కార్డు చూయించాలి: ఆర్ ఎం ఎస్తర్ ప్రభు లతఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి. వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సుల్లో ప్రయాణించే మహిళలు వారి ఆధార్ కార్డు చూయించాలి. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆరు డిపోలు, వాటి పరిధిలో ఉన్న రెండు మిని డిపోల పరిధిలో ఇప్పటి వరకు 35 శాతం మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ బస్సుల్లో బాలికలు, గృహిణులు, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర బార్డర్ వరకు మాత్రమే ఉంటుంది. బార్డర్ దాటితే తప్పనిసరిగా టికెట్ తీసుకోవలసిందే. ఉచిత ప్రయాణానికి సంబంధించి డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే సూచనలు జారీ చేశాం. వారు మహిళలకు సహకరిస్తారు. బస్సుల్లో సీట్లు లేకున్నా నిలబడి ప్రయాణించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

Next Story

Most Viewed