- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆర్టీసీ 'గమ్యం యాప్' మీ సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: టీఎస్ ఆర్టీసీ 'గమ్యం యాప్' తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత తెలిపారు. మంగళవారం పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం,వివాహ శుభ కార్యాలు,విహరయాత్రల ప్రత్యేక బస్సులు, గమ్యం యాప్ ల గురించి అవగాహన కల్పించారని ఆమె తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా ప్రయాణికులకు బస్సు ప్రయాణ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా ఈ గమ్యం యాప్ తో మరో ముఖ్యమైన అడుగు వేసిందని ఆమె తెలిపారు.ఈ యాప్ తో బస్ ట్రాకింగ్ సామర్ధ్యాలతో ప్రయాణం మరింత సులభతరం చేయడానికి రూపొందించబడింది ఆమె వివరించారు.ప్రతి ప్రయాణికుడు తమ సెల్ ఫోన్ లోని 'ప్లే స్టోర్' నుండి ఈ 'గమ్యం యాప్' ను డౌన్లోడ్ చేసుకొని బస్సు గమ్యస్థానంతో మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో సులభంగా గుర్తించవచ్చని ఆమె తెలిపారు.