- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
bad Roads : రోడ్లు ఇలా..ప్రయాణం ఎలా

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని కొత్తగూడెం, వేల్పుచర్ల, బొల్లంపల్లి, తిమ్మాపురం-సంగెం రోడ్ల మీద ప్రయాణం చేయడం అనేది యమపురికి ప్రయాణం చేసినట్లుగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు గోడు వెల్లబోసుకుంటున్నారు. గత పదిహేను ఏళ్లుగా పాలకులు రోడ్ల నిర్మాణం, పాత వాటిని మరమ్మతులు చేయించకపోవడం వల్ల రహదారులు
పూర్తిగా దెబ్బతిని, ప్రయాణం చేయడం నిత్యం సవాళ్లతో కూడినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేల్పుచర్ల రోడ్డు పక్కన దిగబడిన పాఠశాల బస్సు ఉదంతం ఈ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇకపోతే ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితిని ఊహించడం సాహసం చేయడం లాంటిదే. కొత్తగూడెం గ్రామ ప్రజలు రోడ్లపై గుంతల వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం సవాళ్లతో కూడిన ప్రయాణం : కేసాని రాహుల్, బొల్లంపల్లి
బొల్లంపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల మట్టి రోడ్డు మీద ప్రయాణం నిత్యం సవాళ్లతో కూడిందిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తక్షణమే అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
- Tags
- bad Roads