రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు..

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు..
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలం పరిధి పెద్దకాపర్తి స్టేజ్ జాతీయ రహదారి సమీపంలోని చెరువు కట్ట వద్ద చిట్యాలకు వచ్చేందుకు తమ వాహనాన్ని యూటర్న్ తీసుకుంటున్న ఒరిస్సా కూలీల ట్రాక్టర్ ను ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన 20 మంది దినసరి కూలీలు పెద్దకాపర్తి గ్రామంలో చెట్లు నరికే పని మాట్లాడుకొని నిత్యం చిట్యాల నుంచి పెద్దకాపర్తికి వెళ్లి పని చేసి తిరిగి చిట్యాలకు వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకొని ట్రాక్టర్ లో చిట్యాలకు వెళ్తూ జాతీయ రహదారి 65 పై చెరువు కట్ట వద్ద చిట్యాల వైపు యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ట్రాక్టర్ లో మొత్తం 20 మంది కార్మికులు ఉండగా 16 మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో 11 మంది కార్మికులను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, అయిదుగురి కార్మికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై ధర్మ తెలిపారు. ఇట్టి ప్రమాదంలో ఎవరికి ప్రాణహాని సంభవించలేదు. సంఘటనా స్థలాన్ని చేరుకొని సంఘటనకు గల కారణాలు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Next Story

Most Viewed