చౌటుప్పల్ పీఎసీఎస్ చైర్మన్ తొలగింపు

by Disha Web Desk 22 |
చౌటుప్పల్ పీఎసీఎస్ చైర్మన్ తొలగింపు
X

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పీఎసీఎస్ వైస్ చైర్మన్‌గా ఉన్న చెన్నగోని అంజయ్య గౌడ్‌ను నూతన చైర్మన్ గా శనివారం ఎన్నుకున్నారు. నూతన ప‌ీఎసీఎస్ చైర్మన్‌గా ఎన్నికైన అంజయ్య గౌడ్‌కు స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ… మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చైర్మన్‌గా ఎన్నికైనందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను నిరంతరం రైతు సంక్షేమం కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed