మత సామరస్యానికి ప్రతీక హజ్రత్ సులేమాన్ షావలి (చిన్న దర్గా): ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

by Hamsa |
మత సామరస్యానికి ప్రతీక హజ్రత్ సులేమాన్ షావలి (చిన్న దర్గా): ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
X

దిశ, దేవరకొండ: మత సామరస్యానికి ప్రతీక హజరత్ సులేమాన్ షా వలి (చిన్న దర్గా) అని దేవరకొండ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

గురువారం దేవరకొండ పట్టణంలో హజరత్ సులేమాన్ షావలి (చిన్న దర్గా) ఉర్సు ఉత్సవాల సందర్భంగా "గంధం" సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్గాకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, కోరిన కోరికలు తీర్చే దర్గా కుల మతాలకు అతిథులుగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో దర్గాను సందర్శించుకుంటున్నారని ఆయన అన్నారు..

దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, డి.ఎస్.పి మేక నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్ ,రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడితే దేవేందర్ నాయక్, సీఐ శ్రీనివాసులు, ఉస్మాన్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ,జాఫర్ అలీ, ఎండి జానీ బాబా, ఎండి జావిద్ ,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed