ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రాబట్టాలి : ఎమ్మెల్యే

by Kalyani |
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రాబట్టాలి : ఎమ్మెల్యే
X

దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలు నాయక్ నివాసంలో మంగళవారం కస్తూర్బా, మోడల్ స్కూల్ ఎంఈవో లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల, కళాశాలల్లో విద్యుత్, టాయిలెట్లు, ప్రహరీ గోడ నిర్మాణం తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేలాదిగా మూతబడిన ప్రభుత్వ పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పూర్వ వైభవం తీసుకు రావడం జరుగుతున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ప్రతి బాలికల పాఠశాల, కళాశాలల వద్ద ఈవ్-టీజింగ్, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికి ఆదేశించి, అట్టి పరిసర ప్రాంతాల్లో తన సొంత నిధుల నుంచి CC కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Next Story