శాసనమండలిలో పోరాడే సత్తా ఉన్న నాయకుడు ప్రేమేందర్ రెడ్డి : బండి సంజయ్

by Kalyani |
శాసనమండలిలో పోరాడే సత్తా ఉన్న నాయకుడు ప్రేమేందర్ రెడ్డి : బండి సంజయ్
X

దిశ, కోదాడ : రాష్ట్రంలో గత 10ఏళ్లు గా రైతుల నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల, కోసం పోరాడింది బిజెపి నాయకులేనని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం జైలు కెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నది తాను తన పార్టీ నాయకులేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడారు… ఉద్యోగుల పి ఆర్ సి,, డి ఏ లు, 37 జీవో రద్దు కోసం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కోసం రైతులకు రైతుబంధు రెండు లక్షల రుణమాఫీ ధాన్యానికి 500 బోనస్ వీటి కోసం పోరాడింది కాంగ్రెస్ వాళ్లు కాదని బిజెపి నాయకులైన అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల కోసం తాము పోరాటం చేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు తనకు రాజకీయాల కంటే ధర్మమే ముఖ్యమని రాముని కించపరిచే వారికి ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు. బిజెపి కార్యకర్తలు అంతా రాముని వారసులమన్నారు. కేసీఆర్ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాడింది తానేనన్నారు. కేసీఆర్ కి తనంటే భయమని తనపై 109 కేసులు పెట్టించారన్నారు. హిందీ పేపర్ లీకేజీ చేయించానని కేసు పెట్టించడం హాస్యాస్పదమన్నారు.

ఈ సందర్భంగా పలువురు బండి సంజయ్ ని ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి, పత్తిపాటి విజయ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, చల్లా శ్రీలత రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, కన్వీనర్ కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, యాద రమేష్ ,నూనె సులోచన, మల్లె బోయిన అంజి యాదవ్, అన్నే కంటి రామచంద్రయ్య, ఓరుగంటి కిట్టు, కనగాల వెంకటరామయ్య, సాతులూరిహనుమంతరావు,జుట్టుకొండ బసవయ్య, నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు గ్రామ శాఖల అధ్యక్షులు కార్యదర్శులు పలు హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

Next Story