గర్భిణులు సమతుల ఆహారం తీసుకోవాలి : కలెక్టర్

by Disha Web Desk 15 |
గర్భిణులు సమతుల ఆహారం తీసుకోవాలి : కలెక్టర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : గర్భిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన శుక్రవారం సభకు హాజరై మాట్లాడారు. గర్భిణులు తమ పేరును నమోదు చేయించుకోవాలని కోరారు. దాంతో ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం, సలహాలు అందించనున్నట్టు చెప్పారు. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయడం ద్వారా సాధారణ డెలివరీలు జరుగుతాయని తెలిపారు. జంక్ ఫుడ్ తినవద్దని, పిల్లలకు అలవాటు చేయవద్దని అన్నారు. శుక్రవారం సభల ద్వారా పోషకాహారం, ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. బిడ్డకు మొదటి వెయ్యి రోజులు చాలా ప్రాముఖ్యమైనవని, బిడ్డ మెదడు అభివృద్ధి వేగంగా ఉంటుందని, పోషకాహార లోపానికి గురి కాకుండా కాపాడాలని సూచించారు. అందుకోసం తల్లి పోషకాహారం తీసుకోవాలని, ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని, రక్తహీనత తగ్గించడం కోసం ప్రతి తల్లి ఆకు కూరలను రోజూ తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ సమావేశాలకు తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలని,పిల్లలకు సమయం కేటాయించి గడపాలని, వారిని గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, మండల పంచాయతీ అధికారి, సర్పంచ్ జక్క కవిత, సిడిపిఓ స్వరాజ్యం, సూపర్వైజర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed