- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మళ్లీ సీఎం కేసీఆర్ కావాలనే ప్రార్థించా : ఎమ్మెల్యే
దిశ, నేరేడుచర్ల /పాలకవీడు: జాన్ పహాడ్ దర్గాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైది రెడ్డితో కలిసి పీసీసీ మాజీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. వారికి దర్గా ముజావర్ జానీ బాబా ప్రత్యేక స్వాగతం పలికారు. తన ఇంటి నుంచి దట్టిలను చేదార్లను తీసుకువచ్చి బాబా సమాధులపై కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక నిర్ణయాన్ని కోరుకుంటున్నారని మళ్లీ సీఎం కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రార్ధన చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసే బీఆర్‌ఎస్ పార్టీలో చేరానని ఆ పథకాలను ముందుకు తీసుకువెళ్లడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అవమానాలను, అవహేళనలు సామాజిక కోణంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆత్మగౌరవం లేకపోవడంతోనే పార్టీ మారవలసి వచ్చిందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ రమణ నాయక్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసోజు శంకరమ్మ రాష్ట్ర మైనార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు క్రిష్టిపాటి అంజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.