పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ బోల్తా.. నలుగురికి గాయాలు

by Disha Web |
పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ బోల్తా.. నలుగురికి గాయాలు
X

దిశ, మోత్కూరు: మోత్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వ్యాన్ సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ కేంద్రంలోని సెక్రెడ్ హార్ట్ పాఠశాల సమీపంలో పల్టీకొట్టడంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాల పాలయ్యారు. సంఘటనకు సంబంధించి మోత్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేర ఆరోపణలో ఉన్న ఒక వ్యక్తిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా.. సెక్రడ్ హార్ట్ సమీపంలోకి రాగానే వ్యాను ఎడమవైపు లాగుతూ ఉండడంతో ఒకేసారి డ్రైవర్ కుడివైపు తిప్పడంతో, అదుపుతప్పి పల్టికొట్టింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో పాటు నలుగురు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం 108లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పెట్రోలింగ్ వ్యాన్ డ్రైవర్ పాండరి పాండు ఈ రోజే మోత్కూర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరినట్లు సమాచారం.
Next Story