- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు.. అంటించుకునే వ్యాధి..

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని జాజిరెడ్డిగూడెం మండల మెడికల్ ఆఫీసర్ డా.నగేష్ అన్నారు. ఆదివారం అర్వపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షితం కాని లైంగిక సంపర్కం వలన, సురక్షితం కాని రక్త మార్పిడి వలన సుఖ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు.
ఎయిడ్స్ వ్యాధిని ద్వేషించాలి కానీ, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను కాదని అన్నారు. ఎవరైనా హెచ్ఐవీ వైరస్ బారిన పడితే ఏఆర్టీ సెంటర్ లో మందులు వాడి జీవిత కాలాన్ని పెంచుకోవచ్చునని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలందరు ప్రజలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్ సునీత, ఎంఎల్ హెచ్ పీ వాణి , వర్షిత, గౌతమి, హెల్త్ అసిస్టెంట్స్ కుంభం.వీరయ్య, సైదమ్మ, దుర్గమ్మ, జ్యోతి, శకుంతల, నాగరాణి, ఊర్మిళ, గిరిజ, శ్వేత పాల్గొన్నారు.