ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత : మాజీ ఎమ్మెల్యే పైళ్ల

by Aamani |
ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత : మాజీ ఎమ్మెల్యే పైళ్ల
X

దిశ,భూదాన్ పోచంపల్లి: ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు .శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయ 48వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి రథం ఊరేగింపుని సీత వారి సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిమంది మహిళా భక్తులు మంగళ హారతులతో ఆట పాటల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ ,మాజీ వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, నాయకులు గునిగంటి మల్లేష్ గౌడ్, సీత శ్రవణ్, వేముల సుమన్ గౌడ్, మార్కండేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షులు సీత సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భారత ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి, సహాయ కార్యదర్శి గుర్రం కృష్ణ, కోశాధికారి ఇంజమూరి యాదగిరి, ధర్మకర్తలు చిక్క వెంకటేశం, వనం కృష్ణ, మెరుగు ఎతిగినందం,ఆటిపాముల నాగేష్, గుండు జయలక్ష్మి, పొట్టబత్తిని శిరీష తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed