చిట్యాల మండలంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత..

by Disha Web Desk 19 |
చిట్యాల మండలంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత..
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని కోళ్ల ఫారాలలో అక్రమంగా డంప్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు మంగళవారం తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామ శివారులో గల ధర్మారెడ్డి కోళ్ల ఫారాలలో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వరరావుకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి రెవిన్యూ, పోలీస్ సిబ్బందితో కోళ్ల ఫారాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వచేసిన 330 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా ఆటోలో లోడ్ చేసిన మరో 12 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, లారీ, ఆటోను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని జిల్లా పౌరసర గోదాంకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడితే సహించేది లేదని.. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.


Next Story

Most Viewed