కోదాడ ఎంపీపీ పై అవిశ్వాసం...?

by Disha Web Desk 22 |
కోదాడ ఎంపీపీ పై అవిశ్వాసం...?
X

దిశ, కోదాడ: కోదాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కొండంత బలం చేకురినట్లు అయింది. ఇన్ని రోజులు తాము అధికారంలో లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఆ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులది. ప్రస్తుతం రాష్ట్రంలో కోదాడలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీంతో గత కొన్ని రోజులుగా ఎంపీటీసీలు కొందరు కోదాడ ఎంపీపీ పై అసహనంగా ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నా వాళ్ళకి సరైన అవకాశం దొరికినట్లు అయింది. దీంతో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు ఏకమవుతున్నట్లు సమాచారం. కోదాడ ఎంపీటీసీలు 11 మంది ఉండగా అందులో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఉన్న 9 మందిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం... వారి తోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు ఎంపీటీసీలు అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున 5 గురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. వీరిలో మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇద్దరు పార్టీలో చేరిన అనంతరం అవిశ్వాసానికి పెట్టే అవకాశం ఉందని ఎంపీటీసీ ఒకరు తెలిపారు. త్వరలోనే అవిశ్వాసం పెడతామని , అభివృద్ధిలో అట్టడుగు ఉన్న కోదాడ రూరల్ మండలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.Next Story

Most Viewed