రైతుల చెప్పులు.. బందవస్తుగా ఉంటాయి: కాంగ్రెస్ నేతలకు KCR కౌంటర్

by Disha Web Desk 9 |
రైతుల చెప్పులు.. బందవస్తుగా ఉంటాయి: కాంగ్రెస్ నేతలకు KCR కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన రోడ్డు షో లో గులాబీ బాస్ మాట్లాడుతూ.. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతో కొడతా అని ఒక మంత్రి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగారు చెప్పులు మీకే కాదు రైతులకు కూడా ఉంటాయి.. వాళ్ల చెప్పులు ఇంకా చాలా బందవస్తుగా ఉంటాయని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed