ఎన్నికల కోడ్‌‌పై అధికారుల నిర్లక్ష్యం.. కళ్ల ముందు కనిపిస్తున్న చూడని వైనం..

by Aamani |
ఎన్నికల కోడ్‌‌పై అధికారుల నిర్లక్ష్యం.. కళ్ల ముందు కనిపిస్తున్న చూడని వైనం..
X

దిశ,చివ్వేంల : ఎన్నికల కోడ్‌ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.ఆయన పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 27న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి కి సమీపంలోని దురాజ్ పల్లి జంక్షన్ వద్ద బస్టాండ్ పైన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫోటో ఉన్న అధికారులకు ఎన్నికల కోడ్ గుర్తుకు రాకపోవడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ పెద్ద జాతర లింగమంతుల స్వామి జాతర ఏర్పాటు జరుగుతుండడం రెండు రోజుల క్రితం పెద్ద గట్టు పరిసరాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. పెద్దగట్టుకు వెళ్లాలంటే ఆ బస్టాండ్ ముందు నుంచే వెళ్లాలి.జాతర సమీపిస్తున్నందున నిత్యం అధికారులు ఆ దారిలో వెళ్తున్నారు కానీ బస్టాండ్ ను పరిశీలించకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్ధం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. దురాజ్ పల్లి చివ్వేంల రెవెన్యూ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో విలీనం కావడం జరిగింది. జిల్లా అధికారులు ఎన్నికల కోడ్ ను ఎలా అమలు చేస్తున్నారో ఈ బస్టాండే నిదర్శనం. ఎన్నికల కోడ్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed