అక్రమాలకు కేరాఫ్‌గా ​నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి

by Disha Web Desk 12 |
అక్రమాలకు కేరాఫ్‌గా ​నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి
X

దిశ, నల్లగొండ: అసలేం జరుగుతుంది.. పట్టించుకునే వారే లేరా.. మేము ఆడిందే ఆట..పాడిందే పాట అన్న విధంగా ఉంది నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి తీరు. అధికారులు చోద్యం చూస్తున్నారా..లేక ఆసుపత్రి వచ్చే నిధులలో కాజేసే వాటా వారికి కూడా అందుతుందా.. అనే అనుమానం కలుగుతుంది. ఆసుపత్రికి పోవాలంటే జనం జంకుతున్నారు.

టెండర్లు లేని క్యాంటీన్..?

దేనికైనా నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన ఉంటుంది.. కానీ ఈ ఆసుపత్రి లోని సూపరింటెండెంట్ విధానం మాత్రం రాచరిక పాలనను అద్దం పట్టేలా ఉంది.ఆయన అనుకుంటే పర్మిషన్ లేకుండా టెండరు లేకుండా ఏ పని అయిన అయిపోతుంది. ద్వారం ముందు ఉన్న క్యాంటీన్ కి ఎలాంటి అనుమతులు లేవు. అని అలాగే ఎంతో మంది పేద మహిళలు గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం నల్లగొండ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతూ ఉంటారు. వారికి నాణ్యమైన ఆహారం ఇవ్వడంలో ఈ ఆసుపత్రి వారు విఫలమైందని మన అందరికీ తెలుసు.

కానీ మాత సంరక్షణ కేంద్రం ముందు ఉన్న క్యాంటీన్ మాత్రం పైరవీలతో నడుస్తుందని.. దానికి ఎలాంటి టెండరు లేదు అని అది పూర్తిగా సూపరింటెండెంట్ చేతుల మీదుగా నడుస్తుందని.. దాంట్లో ఆయన ఇలా ఆసుపత్రికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ.. ఆయన జోబు నింపుకుంటున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మూడు క్యాంటీన్లు ఉన్నాయి ఒకటి మెడికల్ కళాశాలకు చెందినది అది టెండరు ద్వారా నడుస్తుంది మిగిలిన రెండు క్యాంటీన్లు ఒక టిఫిన్ బండి నెల నెలా మాములు అధికారులకు ఇస్తూ పబ్బం గడుపుతున్నట్లు తెలుస్తుంది.

కోట్ల ప్రజా ధనం వృధా..

దేశవ్యాప్తంగా ప్రారంభించిన పట్టణ ప్రగతిలో భాగంగా స్వచ్ఛ భారత్ 2022 లో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య నీటిని మంచినీటిగా మార్చే ప్లాంటును ఆసుపత్రిలో ప్రతి రోజు 150 లీటర్స్ నీటిని బయటకు పంపు చేసే మోటార్స్, ట్యాంకర్లు ఏర్పాటు చేసారు. కోటి రూపాయలు పైన ఖర్చు చేసిన ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పై పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు ల అయింది.

ఇంతవరకు ఒక్క లీటర్ వాటర్ కూడా శుద్ధి చేయలేదు .మొత్తం శిథిలమై పోతున్నాయి.పట్టణ ప్రగతి పేరున ఇంకా ఎంత సొమ్ము వృధా అయ్యిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇకనైనా జిల్లా ఆరోగ్య అధికారులు,ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి పెడతారని ఆశిద్దాం.

నిరాశ్రయులకు ఆశ్రయం ఎపుడు..?

పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్ర భవనం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో పురపాలక సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో నిర్మించారు. దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. నిరాశ్రయులు నల్లగొండలో రోడ్ల వెంట ఆహారం లేక సరియైన బట్టలు లేక పడుకోవడానికి చోటు లేక చెత్త కుప్పలు పక్కన రోడ్ల వెంట జీవనం సాగిస్తున్నారు. వారి సంక్షేమం కోసం నిర్మించిన భవనం వెంటనే ప్రారంభించాలి అని పలువురు కోరుతున్నారు.అధికారులు నాయకులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

జంకుతున్న జనాలు..

ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలు చూసి నల్లగొండ ప్రజలు పలువురు ఆ ఆసుపత్రి అంటేనే జంకుతున్నారు.అధికారులు దృష్టి పెట్టి అవినీతి అధికారికి నోటీసులు ఇస్తారా లేక ఆయనకు వంతా పడుతారా అనే కోణంలో ఆలోచిస్తున్నారు.

అధికారులు వాటా దారులా!

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మీద పూర్తి విచారణ జరపాలని.. అవినీతి మయంలో అధికారులు కూడుక పోయారని రోగుల సమస్యలు గాలికి వదిలేసి డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారని పలువురి అభిప్రాయం అన్ని మందులు అందుబాటులో లేకపోవడం,క్యాంటీన్లు టెండరు లేకుండా నడవడం, పట్టణ ప్రగతి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నడవకపోవడం, నిరాశ్రయుల భవనం ప్రారంభం కాక పోవడం అధికారులు ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు దారిటిస్తున్నాయీ. క్యాంటీన్లు నిర్వహకులు ప్రతి నెల నెలా సుమారు 30 వేల వరకు ఆసుపత్రికి చెందిన ఉన్నత అధికారికి ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story