- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
లాభాల్లో నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు

దిశ,నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా 103 ఏండ్ల చరిత్ర కలిగినది. నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు గొంగిడి మహేందర్ రెడ్డి చైర్మన్ మాట్లాడుతూ నేను ఎన్నికైన నాటి నుండి మూడు ఏండ్ల కాలంలో దాదాపు అరవై కోట్ల రూపాయల లాభాల్లో ఉంది అని,తొమ్మిది వందల ముప్పై కోట్ల టర్నోవర్ లో ఉండేది నేడు 2200 కోట్ల టర్నోవర్ లోకి తీసుకొచ్చామని, తొంభై శాతం రికవరీ రేటు ఉంది అని,కర్షక మిత్ర పేరుతో దాదాపు మూడు వేల రైతు కుటుంబాలకు ఎకరాకు రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయలు రుణ సదుపాయం అందించాము అని అన్నారు,దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్ళడానికి భూమి తనఖా పెడితే ఎరువై ఐదు లక్షల రూపాయల రుణ సదుపాయం కలిపించాము.నల్లగొండ జిల్లా నుండి విదేశీ విద్యకు తొమ్మిది వందల ఐదు మంది విద్యార్థులకు గాను 140 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాము అని అన్నారు.సహకార బ్యాంకు పాలక వర్గం మరియు బ్యాంకు సిబ్బంది అహర్నిశలు రైతుల సంక్షేమం కోసం పనిచేశారు కాబట్టి ఇంతటి ఫలితాన్ని రాబట్ట గలిగాము అని ఈ నెల 24వ తేదీన భారీ ఎత్తున రైతు బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు దిశ తో తెలిపారు.