వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కోర్న నరేష్

by Disha Web |
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కోర్న నరేష్
X

దిశ, గుండాల: గుండాల మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎంపీటీసీ కొర్ణ నరేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తుర్కలశాపురం గ్రామంలో పంట పొలాలను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వరి చేనులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే పంట నష్టం జరిగిన రైతులు, కౌలు రైతుల వివరాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం చేయాలని కోరారు. ఆయనతో రైతులు ఆదినారాయణ, లింగుస్వామి తదితరులు ఉన్నారు.
Next Story