భారీ బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు

by Naresh N |
భారీ బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు
X

దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌తో పాటు వివిధ కార్యక్రమాలు శుక్రవారం ఉదయంతో పూర్తయ్యాయి. మోత్కూరు, అడ్డ గూడూరు, తిరుమలగిరి,నాగారం, శాలిగౌరారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలల నుంచి వివిధ రూట్ల తుంగతుర్తి ఎన్నికల గోదాముకు ఎన్నికల సామాగ్రి చేరింది. ఈ మేరకు 326 ఈవీఎంలతో పాటు దానికి సంబంధించిన సామాగ్రినంత ఏర్పాటైన ప్రత్యేక వాహనాలతో డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ హాలుకు ప్రత్యేకంగా తరలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి, సహాయ అధికారి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి.

Advertisement

Next Story