- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి.. ఎమ్మెల్యే సామెల్
by Sumithra |

X
దిశ, తుంగతుర్తి : అభివృద్ధిలో వెనుకబడ్డ ప్రాంతమైన తుంగతుర్తి మండలంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరుతూ రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రం కూడా సమర్పించినట్లు ఆయన బుధవారం తెలిపారు.
మండలంలోని వెలుగుపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 565 లో 120.21, సర్వే నంబర్ 447 లో 87.08 ఎకరాల ప్రభుత్వ భూమి 365 జాతీయ రహదారికి పక్కనే ఉండి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు సౌకర్యాలు అనుకూలంగా ఉండడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా కంపెనీల ఏర్పాటు వల్ల తుంగతుర్తి ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని ఆయన వివరించారు.
Next Story