- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం..ఏం జరిగిందంటే..?
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం..ఏం జరిగిందంటే..?
by Naveena |

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ప్రజాపాలన గ్రామసభలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజా పాలన గ్రామసభల కార్యక్రమాలలో గ్రామస్తులు అధికారులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి గ్రామసభ హాజరయ్యారు. గ్రామస్తులు గ్రామ సభలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అర్హులైన వారికి కాకుండా ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదని ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు.
Next Story