- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA Jai Veer Reddy : జాతి నిర్మాతలు ఉపాధ్యాయులే…
దిశ, హాలియా : తెలివైన సమాజాన్ని నిర్మించే బాధ్యత ఉపాధ్యాయుల దేనని జాతి నిర్మాణంలో వారిదే కీలక పాత్రని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హాలియా లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గత పదేళ్లుగా ప్రమోషన్లకు నోచని ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలకు అవకాశం ఇచ్చిన విషయం ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. వ్యక్తిత్వాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ శాతాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మప్రతి ఉపాధ్యాయుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్య మేనని పిల్లలను చిన్ననాటి నుండే క్రమశిక్షణ బాట పట్టించే అరుదైన గౌరవం ఉపాధ్యాయునికే దక్కుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ లు ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, అన్నపూర్ణ,పిల్లి చంద్రకళ ఆంజనేయులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి భాస్కర్ నాయక్ కాకునూరి నారాయణ గౌడ్ పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి చింతల చంద్రారెడ్డి గౌని రాజా రమేష్ యాదవ్ ఎంఈఓ బాలు నాయక్ వెంపటి శ్రీనివాస్ పిఆర్టియు మండల అధ్యక్షుడు మంచి కంటి మధు ఆపస్ మండల అధ్యక్షుడు గుర్రం సత్యనారాయణరెడ్డి ఆయా మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.