రైతులను దగా చేస్తున్న మిల్లర్లు,అధికారులు

by Dishaweb |
రైతులను దగా చేస్తున్న మిల్లర్లు,అధికారులు
X

దిశ,పి.ఏ.పల్లి : పి.ఏ.పల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పి.ఏ.పల్లి బీజెపీ మండల శాఖ సందర్శించింది.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు పోతెం కరుణాకర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్న కనీసం అధికారుల నుంచి స్పందన కరువైందని ఆయన అన్నారు.మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై తాలు తేమ సాకుతో క్వింటాలుకు రెండు నుంచి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.ధాన్యం దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.లారీల కాంట్రాక్ట్ తీసుకున్న సదర్ కాంట్రాక్టర్ లారీలను సకాలంలో పంపించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లారీలో బస్తాల లోడింగ్ కు బస్తాకు లారీ డ్రైవర్లు 2 నుండి 4 రూపాయలు తీసుకుంటున్నారని ధాన్యం కేంద్రాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంటాలు వేసి రైతుల అరిగోస తీర్చాలన్నారు. లేనిపక్షంలో బీజెపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలగోని సైదులు గౌడ్, మండల కార్యదర్శి వరుకుప్పల శ్రీరాములు,మండల ఉపాధ్యక్షులు వద్దిరెడ్డి మల్లారెడ్డి, బిజెపి నాయకులు తక్కెళ్ళ లక్ష్మణ్, నేలపట్ల శ్రీను, గుండాల అంజి, లింగస్వామి, రాజు, చంటి ,రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed