- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
TTA కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా మఠంపల్లి NRI ఎన్నిక

దిశ, మఠంపల్లి : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)లో సూర్యాపేట జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐకి చోటు దక్కింది. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన డా.నరసింహా రెడ్డి దొంతిరెడ్డి కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డా.నరసింహా రెడ్డి అమెరికాలో కేన్సర్ చికిత్స మందుల తయారీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. కాగా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) 2023-2024 సంవత్సరాలకు తమ కార్యవర్గాన్ని ఎన్నుకుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన ఈ సంస్థ అనతికాలంలోనే అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో సుమారు 12 వేల కుటుంబాలతో అతి పెద్ద సంస్థగా విస్తరించి భారత్, అమెరికా దేశాల్లో సేవలందిస్తుంది. టీటీఏ 2023-2024 కు 39 మంది బోర్డు సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ ఎన్నికల్లో మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎన్నారై డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా టీటీఏ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. టీటీఏ అధ్యక్షుడిగా వంశీ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నవీన్ మల్లిపెద్ది, కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కార్యదర్శిగా కవితారెడ్డి, కోశాధికారిగా సహోదర పెద్దిరెడ్డి, కార్యనిర్వాహక డైరెక్టర్‌గా దివాకర్ జంధ్యం, సహా కార్యదర్శిగా శివారెడ్డి, సహా కోశాధికారిగా మనోహర్ బోడకె తదితరులు ఎన్నికయ్యారు.