- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
డ్రిప్ స్కీమ్‌తో సాగర్‌కు మహర్దశ..

దిశ, నల్లగొండ బ్యూరో : డ్రిప్ పథకంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నూతన శోభ రానుంది. (డ్యాం రే హాబిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ. 200 కోట్లు సాగర్ ప్రాజెక్టుకు మంజూరు చేయించుకునే అవకాశం ఉంది. ఇందులో 70 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు మంజూరు తో డ్యామ్ అవసరమైన ఎలక్ట్రిషన్, సీసీ కెమెరాలు, సీసీ టీవీలులతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ సిస్టం గా మార్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా డ్యామ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయవచ్చు.
ఇదిలా ఉంటే ప్రాజెక్టు కాలువ లైనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల నీటి విడుదల సమయంలో బుంగలు పడి సాగునీరు వృధా అవడం సహజం. సాగర్ సర్కిల్ పరిధిలో సుమారు 75 కిలోమీటర్ల దూరం కాలువ పారుతుంది. ఈ నేపథ్యంలో కాలువల మరమ్మతుల కోసం రూ.90 కోట్ల బడ్జెట్ అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.పైలాన్,డ్యామ్ కు రెండింటికి కలిపి విద్యుత్ వాడకం జరుగుతుంది. అయితే పైలాన్ లో విద్యుత్ కు ఏ చిన్న అసౌకర్యం జరిగిన డ్యామ్ పరిధిలో విద్యుత్ వాడకంలో ఇబ్బం జరుగుతుంది. ప్రస్తుతం పైలాన్ కు సంబంధం లేకుండా డ్యామ్ పవర్ హబ్ నుంచి నేరుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.8 కోట్ల బడ్జెట్ అవసరమని ప్రతిపాదన పం పించారు. అంతేకాకుండా డ్యామ్ గేట్లకు రం గులు వేయడం కోసం రూ.9కోట్లు, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏర్పాటు చేయడానికి రూ.1కోటి బడ్జెట్ అవసరం కానుందని ప్రతిపాదన పంపారు.
రూర్కీ యూనివర్సిటీ కి లేఖ..
డ్యాం పై స్పిల్ వే మరమ్మతులు చేయడానికి అవసరమైన సలహాలు అందించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు రూర్కీ యూనివర్సిటీ కి లేఖ రాశారు. తొందరలోనే ఆ యూనివర్సిటీ బృందం ప్రాజెక్టును సందర్శించి, పరిశీలించిన అనంతరం నాణ్యమైన రీతిలో మరమ్మతులు చేయడానికి సూచనలు సలహాలు అందజేస్తారు. ఆ తర్వాత అవసరమైన బడ్జెట్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అధికారులు పంపించామన్నారు. లిఫ్ట్ మరమ్మతుల కోసం డ్యాం పై క్రేన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చాలాకాలంగా ఇంజనీరింగ్ అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే క్రేన్ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు లిఫ్టులకు మరమ్మతులు, కొత్త వాటిది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఏర్పాటు చేయాలంటే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎంత బడ్జెట్ అవసరం ఉందో అధికారులు ప్రతిపాదనలు తయారు చేయమన్నారు. ఇదిలా ఉంటే డ్రిప్ నుంచి బడ్జెట్ మంజూరు చేయించుకోవాలంటే ఈ స్కీం కి ప్రత్యేక అధికారిని ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఆ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. అ అధికారి ఆథరైజ్డ్ అధికారి అని పిలుస్తారు. అయితే అధికారిని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ప్రతిపాదన ఇప్పటికే పంపించింది. తొందరలోనే అధికారిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత డ్రిప్ స్కీమ్ నుంచి బడ్జెట్ విడుదల చేయించడం సులభం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
లిఫ్ట్‌ల నిర్మాణానికి రూ.600కోట్లకు పైగా..
సాగర్ సర్కిల్ పరిధిలో 5లిఫ్టుల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. సుమారు రూ.600 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది.ఈ లిఫ్టుల నిర్మాణం పూర్తయితే దాదాపు 31 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. వేములపల్లి మండలం తోపుచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 9.03 బడ్జెట్ విడుదల చేసింది. ఇక్కడ ఆయకట్టు 316ఎకరాల సాగవుతుంది. చిట్యాల సమీపంలో ఉన్న దున్నపోతులగూడెం, చంపాల తిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.219.9కోట్లు మంజూరు చేసింది.దీని కింద 12239 ఎకరాల పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉంది.
దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.32. 22కోట్లు బడ్జెట్ విడుదల చేసింది.ఈ లిఫ్టు పరిధిలో 2500ఎకరాల భూమి సాగు అవుతుంది.దామరచర్ల మండలం బొత్తాయపాలెం-వాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.229.25కోట్లు మంజూరు చేసింది దీంతో 8610 ఎకరాలలో పంటలు సాగు కానున్నాయి. కేశవాపురం--కొండ్రపోలు లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.75.93 కోట్లు మంజూరు చేసింది. ఈ లిఫ్ట్ కింద 5875ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.దామరచర్ల మండలంలోని వాత్స్య తండా- లిఫ్ట్ నిర్మాణం కోసం రూ. 32.91 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిర్మాణం పూర్తయితే 1119 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు కానున్నాయి.