అధికార సైనిక లాంఛనాలతో ముగిసిన లెఫ్టినెంట్ కల్నల్అంత్యక్రియలు.

by Disha Web Desk 23 |
అధికార సైనిక లాంఛనాలతో ముగిసిన లెఫ్టినెంట్ కల్నల్అంత్యక్రియలు.
X

దిశ, బొమ్మలరామారం : భారత వాయు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మండల కేంద్రానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు శనివారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో అధికార సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అంత్యక్రియలో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీత మహేందర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మైనంపల్లి హనుమంతరావు, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప మేలా సత్పతి, రాచకొండ సీపీ డీ ఎస్ చౌహన్, భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర లతో పాటు పలువురు రాజకీయ నాయకులు వినయ్ బాను రెడ్డి పార్థివదేహానికి పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మద్రాస్ రెజిమెంటల్ లెఫ్టినెంట్ కల్న ల్ అమిత్ షా ఆధ్వర్యంలో సైనిక గౌరవ వందనం సమర్పించారు. స్వగృహానికి చేరుకున్న పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక కవాతు ను నిర్వహించారు. అంతకుముందు మండలంలోని రంగాపూర్ చౌరస్తా నుండి మండల ప్రజలు, నాయకులు, యువకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.



దారిపొడవునా పాఠశాల విద్యార్థులు వినయ్ భాను రెడ్డి పార్థివదేహానికి పూలు చల్లుతూ వీడ్కోలు పలికారు. జై జవాన్, వినయ్ బాను రెడ్డి అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ సేవకే అంకితం అయి ప్రాణాలర్పించిన వినయ్ భాను రెడ్డి త్యాగాన్ని కొనియాడారు. సైనికులు గాలిల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘన నివాళులు అర్పించారు. భార్య స్పందన రెడ్డి, ఇరువురు కుమార్తెలు హానిక రెడ్డి, హరివిఖా రెడ్డి ల దుఃఖాన్ని చూసి మండల ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి నరసింహారెడ్డి తలకొరివి పట్టగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంత్యక్రియలు ముగిసే వరకు వెంట నడిచారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బీర్ల ఐలయ్య, సుదాగాని హరిశంకర్ గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ , మండల ప్రజా ప్రతినిధులు ,నాయకులు, యువకులు పాల్గొన్నారు.



Next Story