బహుజనులంతా ఏకతాటిపై నడుద్దాం : వట్టే జానయ్య

by Disha Web Desk 22 |
బహుజనులంతా ఏకతాటిపై నడుద్దాం : వట్టే జానయ్య
X

దిశ, సూర్యాపేట: నియోజకవర్గంలోని బహుజనులంతా ఏకతాటిపై ఉండి, రాజ్యాధికారం తెద్దామని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాల నాయకుల ఆగడాలను అరికట్టాలంటే బహుజన రాజ్యం రావల్సిందేనన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బహుజనులను ఓటు బ్యాంకు వరకే ఉపయోగించుకుంటున్నారే తప్ప నాయకులుగా ఎదగనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు మేల్కొని మన పక్షాన నిలబడే బీఎస్పీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందామని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో భాగంగా తొలుత సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు అనంతుల లింగస్వామి, గుండగాని వెంకన్న, ఉప్పల ఉపేందర్ రెడ్డి, బొడ్డు వీరయ్యలతో పాటు సుమారు 300 మంది బీఎస్పీలో చేరారు. అదే మండలంలోని కేటీ అన్నారం, కుపిరెడ్డిగూడెం గ్రామంలో సుమారు 200 మంది బీఎస్పీ కండువా కప్పుకున్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులోని టీడీపీ వార్డు ఇంచార్జి కడారి హరిబాబు, బొల్లం సైదులు, జిల్లేపల్లి మహేష్, వరుణ్, మహేందర్ లతో పాటు 100 మంది బీఎస్పీలో చేరారు. అనంతరం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 48వ వార్డులోని కోట మైసమ్మ యూత్ ఆధ్వర్యంలో బంటి కమల్ ఆహ్వానం మేరకు కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను, ముక్కాల లింగయ్య ఆధ్వర్యంలో మరో దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బుడిగే మల్లేష్ యాదవ్, జానకి రాములు, వల్లాల సైదులు, కుంభం వెంకన్న, చాంద్ పాష, రాజు, తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed