- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎల్‌బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌కు రివార్డు
by Mahesh |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఎల్‌బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్‌కు రివార్డు లభించింది. ఈ రివార్డును తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు. సుధాకర్ 2020లో భువనగిరి ఎస్ హెచ్ ఓ గా పని చేస్తున్న సమయంలో భువనగిరిలో ఒక మహిళ హత్య జరిగింది. ఈ హత్య కేసును విచారణ చేపట్టిన సుధాకర్ నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు విచారణలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కోర్టు సాక్షధారాలను పరిశీలించి నిందితుడికి జీవిత కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి, కేసు దర్యాప్తులో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు ఆయనను డీజీపీ అభినందించి రివార్డును అందజేశారు.
Next Story