ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లైన్ మెన్

by Dishanational2 |
ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లైన్ మెన్
X

దిశ, దామరచర్ల: మండల కేంద్రానికి చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ బంటు సైదులు లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.మండల కేంద్రానికి చెందిన కర్ణం మోహన్ రెడ్డి అనే రైతు ట్రాన్స్ఫార్మ్ కనెక్షన్ కొరకు పోయిన ఏడాది అక్టోబర్ నెలలో మూడు డీడీలు కట్టి దరఖాస్తు చేస్తే ఈ సంవత్సరం మే నెలలో ట్రాన్స్ఫార్మ్ మంజూరు అయింది. మంజూరు అయిన ట్రాన్స్ఫార్మ్ స్తంభాలు, లైనింగ్ తదితర పనులను స్టార్ట్ చేయాల్సిందిగా అసిస్టెంట్ లైన్ మెన్ ను సంప్రదించగా రూ.3000 లంచం డిమాండ్ చేశాడు. అయితే చివరకు రూ.2500కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహం పన్ని లంచం తీసుకుంటుండగా మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఏసీబీ ఇంచార్జీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అసిస్టెంట్ లైన్ మెన్ ను రేపు(శుక్రవారం)నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed