అసంపూర్తి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కె.వి రమణాచారి

by Dishanational1 |
అసంపూర్తి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కె.వి రమణాచారి
X

దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి.రమణ చారి సంబంధిత కాంట్రాక్టర్లు, సిబ్బందికి సూచించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ పండుగలకు సంబంధించి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లగొండ పట్టణంలో రోడ్డు మధ్యలో ప్యాచ్ పనులను పూర్తి చేయాలని, ఈద్గా, వైకుంఠధామల వద్ద అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని, కావలసిన తాగునీటి వసతిఏర్పాటు చేయడంతోపాటు వీధిలైట్ల ఏర్పాట్లను కూడా చేయాలని సూచించారు. నల్లగొండలోని పాత బస్తీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని, మసీదుల వద్ద కావలసిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ రాములు, డీఈలు వెంకన్న, అశోక్, నరసింహారెడ్డి, ఏఈలు దిలీప్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తుజా, శంకర్, శ్రీనివాస్, సంబంధిత కాంట్రాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed