'బీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి'

by Disha Web Desk 13 |
బీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి
X

దిశ, మునగాల: బీఆర్ఎస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని మాధవరం, ఈదుల తండా, నేలమర్రి, వెంకటరాంపురం, కలుకోవ, మునగాల, నారాయణ గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు, 24 గంటల విద్యుత్, హరితహారం, రైతుబంధు, తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయంటే అది కేసీఆర్ కృషి అని ఆయన తెలిపారు.

తాను గత ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి తనను నేరుగా కలుసుకునే వెసులుబాట కల్పించానని, నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవ చేశానని.. కారు గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అజయ్ కుమార్, ఎలక వెంకట్ రెడ్డి పీఎ‌స్‌సీఎస్ చైర్మన్ కందిబండ సత్యం, ఉడుం కృష్ణ తోగరు సీతారాములు, కొంపెల్లి వీరబాబు, గన్న నరసింహారావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed