- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ప్రజల తిరుగుబాటు మొదలైందని, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న గ్రామసభలు తీవ్ర గందరగోళంగా మారాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు యాదగిరిగుట్ట ఈవో భాస్కరరావు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం భువనగిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ యదగిరిగుట్ట దేవస్థానాన్ని కేసీఆర్ మహాద్బుతంగా అభివృద్ధి చేశారని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుకున్నారు. యాదగిరిగుట్టలో మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ అంటేనే చైతన్యానికి మారుపేరని, కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.
మిషన్ భగీరథతో నీళ్లు ఇవ్వడం ద్వారా నల్లగొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అని పార్లమెంట్ లో ప్రకటించినట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన అద్భుతమన్నారు. మూసీనది కాలుష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ నడుం బిగించినట్లు చెప్పారు. ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం 36 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 42 వేల కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. ఎస్టీపీ ప్లాంట్ లను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసీని ఏటీఏంగా మార్చుకుని, ప్రక్షాళన పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన అంటూ పేదలను రోడ్డున పడేస్తున్నారని, పేదల ఇల్లు కులుస్తున్నారని, మూసీ ప్రాజెక్టులో ధనాన్ని దోచి, ఢిల్లీకి కప్పం కట్టెల కాంగ్రెసు కుట్ర చేస్తుందన్నారు. రౌడీ మూకలతో కాంగ్రెస్ పార్టీ వాళ్లు భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో 61 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ అని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేరని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని, ఉమ్మడి నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, అద్భుతమైన కలెక్టరేట్ లను కట్టామని చెప్పారు.
ఆదాయాన్ని పెంచి పేదలకు పంచేలా బీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు పెడుతున్న గ్రామ సభలు గందరగోళంగా మారాయని, లబ్ధిదారులకు పథకాలు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. అన్ని పథకాల్లో కోతలు పెట్టారని, ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ చేశారన్నారు. నీటి ప్రాజెక్టు లను మూలకు పడేసారని, నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ ప్రాజెక్టు లు నత్తనడక నడుస్తున్నాయని, సాగర్ ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యసంగిలో ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలని కుట్ర చేస్తున్నారని, అది ఎవరి వల్ల సాధ్యం కాదని, రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయని, కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడే రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.