ప్రజల తీర్పును గౌరవిస్తున్న : కంచర్ల భూపాల్ రెడ్డి

by Disha Web Desk 20 |
ప్రజల తీర్పును గౌరవిస్తున్న : కంచర్ల భూపాల్ రెడ్డి
X

దిశ, నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భారీ మెజార్టీ ప్రతిరౌండ్ లో వచ్చింది. ఇంకా లెక్కింపు జరుగుతున్న కంచర్ల భూపాల్ రెడ్డి బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ నల్లగొండలో అబివృద్ది ఆగొద్దు అన్నారు. నాకు 2018లో అవకాశం ఇచ్చినందుకు నల్లగొండలో 1350 కోట్ల రూపాయల అబివృద్ది కార్యక్రమాలు చేశామని ఆ పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే నల్లగొండ అరాచకాలు అక్రమాలకు పుట్టినిల్లుగా మారబోతుందని ప్రజలే చూస్తారు అని అన్నారు. ఓటమి గెలుపులు సహజం అలాగే గతంలో కూడా నేను ఓడిపోయా కానీ హైదరాబాద్ కి పారిపోలేదు ఇక్కడే ఉన్న ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా అని అన్నారు. నల్లగొండ భవిషత్తును మీరే చూస్తారు. ప్రజలు తీసుకున్న నిర్ణయంని స్వాగతిస్తూ గౌరవిస్తున్నానన్నారు.Next Story

Most Viewed