బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలి : జనార్ధన్ గౌడ్

by Disha Web Desk 15 |
బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలి :  జనార్ధన్ గౌడ్
X

దిశ,నల్లగొండ : పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ లు పెంచి బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్ షిప్ లు ఐదు సంవత్సరాల క్రితం నిర్ణయించారని, ఆంధ్రప్రదేశ్ లో 20 వేలు ఇస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీలకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్​ మెంట్​ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉచితంగా కాలేజీ చదువు పూర్తి చేశారని గుర్తు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, యువజన సంఘం ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్, జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మగొటి శివ కుమార్, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, కడారి నరేష్ ,రాజు,సంతోష్, సిద్దు, పండ్ల హరికృష్ణగౌడ్, నాగరాజు, రామస్వామి, స్వామియాదవ్, బొల్లం గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story