కలెక్టరేట్ లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

by Naveena |
కలెక్టరేట్ లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
X

దిశ సూర్యాపేట కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ అదనపు కలెక్టర్ బిఎస్ లత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తల్లిదండ్రుల పోషణ,సంరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధులు ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేట పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమం కొరకు భవన నిర్మాణాన్ని డిసెంబర్ లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వయోవృద్ధుల కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి శుక్రవారం వయోవృద్ధులు ఆర్డీవో కార్యాలయంలో తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వయోవృద్ధుల సమస్యలను, మెయింటినెన్స్ ఆర్డీవోలు చూస్తారని,వారి ఆస్తి,భూముల మార్పడి, జిల్లా అప్పిలేట్ ట్రిబునల్ల్స్ కలెక్టర్ తో సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక కమిటీ ఏర్పాటు చేసి వయోవృద్ధుల సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని కలెక్టర్ తేజస్ అన్నారు. వయోవృద్ధులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులందరికీ కలెక్టర్ స్వయంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యు ఓ నర్సింగరావు, ఆర్డిఓ వేణుమాధవ్, డిఎస్పి రవికుమార్, వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు రాంబాబు, సెక్రెటరీ అమీర్ ఖాన్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్చార్జ్ సత్యనారాయణ, విజయమ్మ ,సావిత్రమ్మ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story