- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీలో నాకు తీరని అన్యాయం
దిశ, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో నాకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుమూలపురి రవిబాబు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మా నాన్న అనుములపురి పరంధాములు సూర్యాపేట ఎమ్మెల్యేగా పని చేసిన నాటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు. నాడు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా పేరు సంపాదించానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చంద్రబాబుకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీలో పనిచేసే వ్యక్తులకు సరియైన గుర్తింపు లేదని, తుంగతుర్తిలో గుడిపాటి నరసయ్య, ప్రీతంలకు టికెట్లు ఇవ్వకుండా మందుల సామెల్ కు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షులు, రాంరెడ్డి దామోదర్ రెడ్డి కలిసి తనతో ఇంత వరకు కనీసం మాట్లాడలేదని, దళితులంటే వారికి చిన్న చూపని విమర్శించారు. ఇప్పటికైనా బడుగు, బలహీన వర్గాల నాయకులు ఏకమై దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పంగరెక్క సంజీవ్ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షులు కే.రాజేష్, జలీల్ సమ్మద్, నామ రాకేష్, విజయ్ భాస్కర్, నిధి కుమార్, వడ్డె రాజు తదితరులు పాల్గొన్నారు.